అక్కల్ చెడ గ్రామంలో రియల్ ఎస్టేట్ ల ఇష్టారాజ్యం

భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొంత సురేష్

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలంలోని అక్కల్ చెడ గ్రామంలో రియల్ ఎస్టేట్ ల ఇష్టారాజ్యం గ వుంటుందని భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొంత సురేష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అనుమతులు లేని వెంచర్లు
వ్యవసాయ భూముల్లో ఏర్పాట్లు చేస్తూ, యదేచ్చగా
అక్రమ వ్యాపారం చేస్తున్నారని,ప్రభుత్వ రాబడికి భారీగా గండి కొడుతున్నట్లు ఆరోపించారు.కొనుగోలు దారులపై భారం వేస్తూ, మామూళ్ల మత్తులో అధికారులు వుంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్ట రాజ్యం వుందని, గ్రామ పంచాయతీ అనుమతి ఉండదనీ, కన్వర్షన్ చేయరనీ, ఏకంగా వ్యవసాయ,వ్యవసాయేతర భూములను కూడా వెంచర్లుగా మార్చేసి అమ్మేస్తున్నారని, పైగా మండల కేంద్రలో స్కూల్స్, కాలేజీలు అంటూ లేనిపోని మాయమాటలతో మోసం చేస్తున్నారనీ, ఇలా చేన్నారావుపేట మండల కేంద్రంలో రియల్ స్టార్ ల మాయాజాలం ఈ మధ్యకాలంలో పట్టణాలు మొదలుకొని గ్రామాల్లో వేగంగా అభివృద్ధి చేస్తున్న మండల కేంద్రాలలో వెంచర్ల జోరుగా వెలుస్తున్నాయనీ, ఎక్కడ నిబంధనలు పాటించడం లేదనీ, కొన్నిచోట్ల వ్యవసాయ భూమిలో రాళ్లుపాతి ఫ్లాట్లు అమ్ముకుంటున్నారని, మరి కొన్నిచోట్ల అసలు ఫ్లాట్లు కూడా వేయకుండానే ఏవో మొక్కలు నాటి కాగితాల్లో చూపించి విక్రయిస్తున్నారని,అనుమతులు లేని వెంచర్లలో స్థలం కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాలనీ, ఇంత జరుగుతున్న అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తుంది. భారీ మొత్తంలో ఆమ్యామ్యాలు అందడమే ఇందుకు కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయనీ అన్నారు.