Wednesday, 4 November 2026

ముందస్తు భయంలో కెసిఆర్‌

వంద గెలుస్తామన్న వారికి ఎన్నికలెందుకు: దిలీప్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): పథకాలు ఫలితాలు ఇస్తున్నాయని, అంతా మనకు అనుకూలంగా ఉందంటున్న సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అసవరం ఏముందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి నేత దిలీప్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలుజరిగినా వంద సీట్లు గ్యారెంటీ అన్న వాళ్లు ఎందుకు తొందర పడుతున్నారని అన్నారు. తెలంగాణ తెచ్చకున్నది అభివృద్ది చేసుకోవడానకే తప్ప ఎన్నికల కోసం కాదన్నారు. అయినా ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పస తేలిపోనుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత ఏవిూ లేదు. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చేసుకుని పార్టీని ఎంతో బలోపేతం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ లో ప్రస్తుతానికి అసలు అసమ్మతి అన్న మాటే లేదు. మరి అలాంటి సమయంలో ఎందుకీ తొందరని అన్నారు. డిసెంబర్‌ 2018లోపు ఎన్నికలు జరపడం ద్వారా మరోమారు అధికారంలోకి వస్తామని అనుకుంటున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది ముఖ్యమంత్రులు తమ పాలన నిర్వహించిన ప్రస్తుత సచివాలయం వాస్తు ప్రకారం లేదని గత నాలుగున్నర సంవత్సరాలుగా అటువైపు కూడా చూడని కెసీఆర్‌ ముందస్తు కోసం మూఢనమ్మకాలుతో ముందుకు పోతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఓ వైపు కంటి వెలుగు, మరో వైపు రైతు బంధు, రైతు భీమా, తెలంగాణ ప్రజల కల అని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు,ఇలా చెప్పుకుంటూనే ఉన్నా..కెసీఆర్‌ లో ఏదో తెలియని భయం కనిపిస్తోందని దిలీప్‌ అన్నారు. సహజంగా ప్రతిపక్షం చాతనైతే ఎన్నికలు పెట్టండి మా సత్తా ఏంటో చూపిస్తాం అని సవాళ్లు విసురుతున్నాయి.పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీ ఇలాంటి సవాళ్ళే విసురుతుంటుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కూడా లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం రెడీ..కెసీఆర్‌ ఇంటికి పోవటం ఖాయం అంటూ సవాల్‌ చేస్తోంది. రాజకీయపరమైన కారణాలు లేకుండా ఎందుకు కెసీఆర్‌ ముందస్తు కోరుకుంటున్నారని పొంగులేటి అన్నారు.