హైదరాబాద్: నీలం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలో ఉన్న సీఎం ఫోన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను సంప్రదించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా సహాయక, రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.




