ముఖ్తార్ పాష 2వ వర్ధంతి సభని విజయవంతం చేయండి
టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి ): ఈ నెల 24న బయ్యారం మండల కేంద్రంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముఖ్తార్ పాష 2వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని పి వై ఎల్ నాయకులు నోముల భానుచందర్ , తోటకూరి సతీష్ లు కోరారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముక్తార్ పాష విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడై పిడిఎస్యు లో చేరి పని చేస్తున్నా క్రమంలోనే ప్రజలకై పని చేయాలని ఉన్నత చదువును వదిలి, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా చేరాడని క్రింది స్థాయి కార్యకర్త నుండి అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూ అంచలంచలుగా ఎదిగాడని అన్నారు. సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యునిగా, భారత కార్మిక సంఘాల (ఐ ఎఫ్ టి యు) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి అసంఘటిత కార్మికులను సంఘటితం చేస్తూ కార్మిక సంఘాలను నిర్మాణాలు చేపట్టి భూమిలేని నిరుపేదలకు కోడి భూమిక బాసట నిలిచారని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కోసం అనేక ప్రజా ఉద్యమాలు చేశారని అన్నారు. ఎన్నో నిర్బంధాలకు సైతం వెనకడుగు వేయకుండా తోటి సహచరులను ఎన్కౌంటర్లలో కోల్పోతున్నప్పటికీ ఉద్యమంలో ముందడుగు వేసిన ఎందరికో ఆయన స్ఫూర్తిని నిలిపిన కామ్రేడ్ పాషన్న రెండవ వర్ధంతి సభను విజయవంతం చేయడానికి తరలిరావాలని వారు కోరారు.