ముఖ్యమంత్రితో ధర్మాన భేటీ
హైదరాబాద్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడే ధర్మాన మంత్రి గంటా శ్రీనివాసరావుతో కాసేపు భేటీ అయ్యారు. రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన ఆయనకు తెలియజేశారు. అక్కడినుంచి నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ గంటా శ్రీనివాసరావుతో కలిసి సీఎంతో భేటీ అయ్యారు.