గిరిజన నాయకులు మాన్య నాయక్
బిజినేపల్లి. జనం సాక్షి. అక్టోబర్.1. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 10% రిజర్వేషన్ పెంచి 33 జీవోను విడుదల చేసినందుకు రాష్ట్రంలోని గిరిజనులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆ సంఘం నాయకులు మాన్య నాయక్ అన్నారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలనలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పరుస్తూ గిరిజనులను కూడా అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి తాండాలకు బిటి రోడ్లను వేయించి గిరిజనులను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సర్పంచులు హనుమ నాయక్ దేవుల కృష్ణా నాయక్ చందులాల్ గోవింద్ పాండు మాన్య నాయక్ దేన్య నాయక్ పుణ్య నాయక్ లిబియా నాయక్ కృష్ణ తదితరులు ఉన్నారు
Attachments area




