Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి సహాయనిది పేద ప్రజలకు వరం లాంటిది ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

 

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి11(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని బోడకొండ గ్రామానికి చెందిన జాటోత్ బక్క S/o రామదాస్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి తెలపడంతో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు చేయించిన 3లక్షల రూపాయలు ఎల్వీఓసి ని వారి కుటుంబసభ్యులకు అందజేశారు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన. రమేష్ కి ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 90వేల రూపాయలు సీఎం ఆర్ ఎఫ్ చెక్కును స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి,తెరాస మున్సిపల్ అధ్యక్షులు అల్వల వెంకట్ రెడ్డి,తెరాసనాయకులు ముత్యాల చిన్న తదితరులు పాల్గొన్నారు.