సికింద్రాబాద్ అక్టోబర్ 20 జనం సాక్షి కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 47 మంది 15,42,500/ విలువైన చెక్కులను, మరియు 11 మంది కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి.సాయన్న అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు వైద్య ఖర్చులకు కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తుంది, అలాగే షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలను పేద ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మక గా వివిధ పథకాలను పేద ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు,
ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, ఎన్.సరిత,బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, బోయిన పల్లి మార్కెట్ మాజీ ఛైర్మన్ టి ఎన్ శ్రీనివాస్, మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, పనాస సంతోష్ కుమార్,వేణుగోపాల్ రెడ్డి, సదానంద గౌడ, ఈ.తేజ్ పాల్, పిట్ల నగేష్,సంతోష్,భాస్కర్ ముదిరాజ్, మురళి యాదవ్,శంకర్,నిత్యానంద, పరుశురాం, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.




