కమ్మర్పల్లి13అక్టోబర్(జనంసాక్ షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గడ్డం స్వామి అందజేశారు. లబ్ధిదారులు శోభ 35500,పద్మ 70 వేల రూపాయలు, ఎం రాజు 30 వేల రూపాయలు, బి రామాంజనేయులు 20వేల రూపాయలు ,ఎస్ శ్రీనివాస్ 18,500 రూపాయల చెక్కులను తీసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ అజ్మీర్ పాషా, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు చింత గణేష్, టిఆర్ఎస్ నాయకులు దాత్రిక రాజీవ్ గాంధీ, సుభాష్ గౌడ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ గడ్డం స్వామి*




