విజయవాడ సిపిఐ సభలో యువత కధం తొక్కాలి

గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): సిపిఐ జాతీయ మహాసభల సందర్బంగా శుక్రవారం విజయవాడలో జరిగే మహా ప్రదర్శన బహిరంగసభ లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని  ఏ ఐ వై ఎఫ్ మండల కన్వీనర్ పంగ సైదులు యువకులను కోరారు. మహాసభ జయప్రదం చేయాలని కోరుచూ మండలంలో ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం ఇస్తానని చెప్పిన కోటి ఉద్యోగాలు ఇవ్వకపోగా రెండు కోట్ల మంది ఉద్యోగులను పీకివేసి నిరుద్యోగులుగా మార్చిన ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానికి దక్కిందని ఆయన అన్నారు. బిజెపి పాలనలో నిరుద్యోగం విలయతాండవం  చేస్తోందని యువకులు పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని ఈ మహాసభలలో యువత ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించి పోరాట కార్యక్రమం రూపొందిస్తారని  ఈ మహాసభలలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు చింతల నవీన్,  ఏ ఐ వై ఎఫ్ నాయకులు, ఇదా ప్రసాద్, మెండే లింగరాజు,నందిపాటి సతీష్,ఈద మధు, అలీమ్, కుర్రు లింగరాజు, పంగ వేణు బత్తిన సైదులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.