Tuesday, 3 November 2026

ముగిసిన ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు

హైదరాబాద్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ  ప్రమాద రహిత వారోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈనెల 23 నుంచి 29 వరకూ చేపట్టిన వారోత్సవాల్లో వివిధ రాకల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. ముగింపు రోజు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన విబిరంలో సుమారు 100మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు రక్తదానం చేశారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు, ఇతర సిబ్బందికి వారం రోజులపాటు వివరించినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్‌ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *