ముగ్గురు చోటా రాజన్‌ అనుచరులు అరెస్టు

అలహాబాద్‌ : అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ అనుచరులుగా భావిస్తున్న ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అలహాబాద్‌లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్‌ లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఎవరిపైనో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే చోటా రాజన్‌ ఎవరో తమకు తెలియదని, మిత్రులను కలుసుకునేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారని ఆ ముగ్గురు వెల్లడించారు.