ముదిరాజులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు సీహెచ్ చంద్రలింగం
కుల్కచర్ల, సెప్టెంబర్ 28(జనం సాక్షి):
ముదిరాజులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు సీహెచ్ చంద్రలింగం అన్నారు.బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని చాపలగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ గండి లక్ష్మయ్య ముదిరాజ్ సమక్షంలో 100 మంది ముదిరాజు సభ్యులతో నూతన కమిటీ వేయడం జరిగింది.గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా చిట్యాల రాములు, ప్రధాన కార్యదర్శిగా గుంటి రాములు, ఉపాధ్యక్షులు పెర్కంపల్లి మొగులయ్య, మరియు పగిడాల రాములు, పగిడాల కృష్ణయ్య, పేర్కొంపల్లి బాలయ్య, చిట్టెల యాదయ్య, గండి సిద్దయ్య, గాదె శ్రీనివాస్, కొయ్య వెంకటేష్, గండి రాములు, కోశాధికారిగా గండి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ గుంటి రమేష్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం మండల ప్రధాన కార్యదర్శి సంగారమని శ్రీనివాస్ ముదిరాజ్, బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్, కావలి నరసింహులు, మహిపాల్, సాయన్న, రఘు, తిరుపతి, గుడాల వెంకటేష్, చెల్లాపూర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, రామ్ నగర్ మాజీ సర్పంచ్ బుచ్చన్న ముదిరాజ్, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు గుంటి సాయన్న, కోడిగా హన్మయ్య, కొండ నర్సయ్య, పగిడాల హన్మయ్య, గండి భీమయ్య, కిష్టయ్య, గుంటి నర్సింలు,గండి రాములు, గుంటి యాదయ్య, గుంటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.