ముదిరాజ్,బెస్త, మత్సకారుల ఆర్థిక అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యం

 

చిగురుమామిడి మండలంలో ప్రభుత్వం తరఫున ఉచితంగా 65చెరువుల్లో 12లక్షల 50వేల రూపాయల విలువ చేపపిల్లల విడుదల:హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 22: మండలంలోని చిన్నముల్కనూరు గ్రామ చెరువులో చేప పిల్లలను గురువారం ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ విడుదల చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్సకారుల, ముదిరాజ్, బెస్త ల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.ప్రతి సంవత్సరం చేపపిల్లలను ఉచితంగా అందివ్వడం జరుగుతుంది.వారికి కావాల్సిన 75శాతం సబ్సిడీ తో డీసీఎం వ్యాన్ లు,సంచార వాహనాలు,ద్వీచక్ర వాహనాలను,వలలను ఇవ్వడం జరిగింది.వారికి ఉపాధి కల్పించడం, తద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.