ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

భైంసా రూరల్ జూలై 31 జనం సాక్షి

తెలంగాణ జన సమితి ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్..

ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని TJS నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు అలాగే నియోజకవర్గ పరిధిలోని తానుర్ మండలoలో గల బొల్సా గ్రామoలో పంట పొలాల మునక వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం రైతాంగానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని,అలాగే బొల్స గ్రామoలో చాలా వరకు ఇళ్లు కూలీ పోయి పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్థానిక ఎంఎల్ఏ చోద్యం చూస్తున్నడాని విమర్శించారు బొల్స గ్రామంలో ఇళ్లకు ఇళ్లు కూలిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే స్థానిక ఎంఎల్ఏ పావు కిలో నూనె, పావు కిలో పప్పు పంచి వెళ్లి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు పేదల పట్ల ఎంఎల్ఏ చిత్త శుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని, వంద ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు అలాగే గత సంవత్సరం వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేని KCR ప్రభుత్వం, ఇప్పుడు ప్రాథమిక అంచనాల పేరుతో స్థానిక అధికారులు, ఎంఎల్ఏ హడావుడి చేయడం హాస్యాస్పదం అన్నారు. అలాగే ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుడు జరిగిన పంట నష్టాన్ని సర్వేలు చేసిన వాళ్లు ఇప్పటి వరకు ఎందుకు నష్ట పరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయి బాబా, రాజు, శంకర్, ప్రశాంత్, మాజీద్, మధు, లింగన్న, దేవిదాస్, రాము తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు