మునుగోడులో ఫ్లోరిన్ మాదిరిగా లాగనే కోమటిరెడ్డి ఆస్తులు పెరిగాయి

రాష్ట్రంలో దేశంలో దయనీయమైన పరిస్థితి నెలకొంది
నల్గొండ జిల్లా…..
నల్గొండ జిల్లా మునుగోడు మండలం లో
మునుగోడు ఈనెల 20 థారికు న బహిరంగ సభ నిర్వహించబడుతుంది.
రాష్ట్రంలో దేశంలో చాలా దయనీ య పరిస్థితి ఏర్పడింది.
– మంత్రి జగదీశ్ రెడ్డి
జనం సాక్షి.మునుగోడు.
మునుగోడు నియోజకవర్గంలో పెరుగుతున్న ఫ్లోరిన్ మాదిరిగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు కూడా పెరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. శనివారం రాత్రి మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఏలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఫ్లోరిన్ మహామారి కారణంగా వేలాదిమంది మృత్యువాత పడుతున్నప్పటికీ వారి గురించి ఏ మాత్రం ఆలోచించని మనిషి కోమటిరెడ్డి అని ఆరోపించారు. ప్రజల సొమ్ములు లూటీ చేస్తున్న కోమటి సోదరులే దొంగ దొంగ అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసే నాటకాలు ఆడారని.. ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంబిస్తూ ప్రజలను రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారనే విషయం ఇప్పటికే ప్రజలందరికి తెలుసు 22 వేలు కాంట్రాక్టర్ల కోసమే,నడిబజార్లో అమ్ముడుపోయాడన్నారు.
ఏ ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ నుండి trs పార్టీ లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఆశించలేదని
ఈ రోజు అందరికి తెలుసు నువ్వు బీజేపీ పార్టీలోకి ఎందుకు వెళుతున్నావో.
ఈ ఉప ఎన్నిక ద్రోహులకు, గుత్తేదారులకు,దొంగలకు మధ్య జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
మునుగోడు నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందింది అంటే 2014 నుండి 2018 వరకేనని. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఆటోడ్రైవర్ లను,లారీ డ్రైవర్ లను నడ్డి విరగ్గొట్టింది బీజేపీ ప్రభుత్వం.ఒకవైపు గీత కార్మికులకు మీరు వేసిన కేసీఆర్ పన్ను తీసేసారు.
పోచంపల్లి, సిరిసిల్ల పర్యటించి చేనేత లకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పారు కేసీఆర్ అని గుర్తు చేశారు.కాంగ్రెస్ ని వదిలి బిజెపి లోనికి ఎందుకు వెళుతున్నావ్,పేదల రక్తం పీల్చే పార్టీ బీజేపీ,గ్యాస్ సబిసిడి వద్దన్న పార్టీ బీజేపీ పార్టీ.
మీ అక్రమ సంపాదన నల్ల డబ్బు దాచుకోవడం కోసం బీజేపీ పార్టీలకు వెళుతున్నావు.మునుగోడు ప్రజా దీవెన సభ నుండి అన్ని విషయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలియచేస్తారన్నారు.
ఈ సభ ద్వారా కోమటిరెడ్డి సోదరుల బండారం అంతా బయట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజావార్తలు