మునుగోడు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం.
జాజుల లింగంగౌడ్
మునుగోడు నియోజకవర్గoలో 60 శాతానికి పైగా బీసీలే ఉన్నారని,వారిని కాదని కాంగ్రెస్ పార్టీ 4 శాతం ఉన్న అగ్రకులాల వారికి పాల్వాయి స్రవంతి కి టిక్కెట్ కేటాయించడాన్నీ బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకిస్తూనట్లు రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అగ్రవర్ణ రాజకీయ పార్టీలు బీసీలను బ్యానర్లు కట్టడానికి,జిందాబాద్ లు కొట్టించడానికే,బహిరంగ సభలకు జనాలను తరలించడానికే బీసీలు అవసరం పడతారు గాని,టిక్కెట్ల కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు.అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నాయని అన్నారు.బీసీలకు టిక్కెట్లు ఇవ్వని పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.