ఘనంగా గణనాథుని శోభాయాత్ర

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): గత తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న గణనాథుని నిమజ్జన శోభాయాత్రను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.స్థానికశంకర్ విలాస్ సెంటర్ లో సుమన్ వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ గణనాథుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.నిమజ్జనోత్సవంలో భాగంగా వాణిజ్య భవన్ సెంటర్ నుండి సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వరకు ఆటపాటలతో, డప్పు వాయిద్యాల మధ్య శోభయాత్రను నిర్వహించారు.ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన లడ్డువేలంలో తోట మధు రూ. 8 వేలకు లడ్డు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపారపు రాజు, బొల్లం సురేష్ , జర్నలిస్ట్ కొండా శ్రీనివాసరావు , చందా రాజశేఖర్ , బండారు సుధాకర్, గుండా సునీత , బొల్లం సంతోషి , యాట స్వప్న రేగట్ట శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.