మునుగోడు ఎన్నికలు నిర్వహించే ధైర్యం బీజేపీకి లేదు
తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదం
చేరిన తెల్లారేసరికి ఎన్నికలే అన్నారు
ఇప్పటికీ ఉలుకూ పలుకు లేదు
ఒక్క నియోజకవర్గాన్ని ఎదుర్కోలేని వాళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడడమా..
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఉప ఎన్నికలు అంటేనే బిజెపి భయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మునుగోడులో ఉప ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఆ పార్టీకి లేదన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.అటువంటి వారు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అక్కడ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తెల్లారేసరికి ఉప ఎన్నికలు అన్నారు.ఇప్పటికీ ఉలుకూ పలుకు లేదన్నారు.దీన్ని బట్టే బిజేపికి ఎన్నికలు అంటే ఎంత భయం ఉందనేది తెలుస్తుందని పేర్కొన్నారు.ఒక్క నియోజకవర్గాన్ని ఎదుర్కోలేని వాళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడడం అంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుందంటూ వ్యాఖ్యానించారు.