Wednesday, 4 November 2026

మునుగోడు గ్రామపంచాయతీ వార్డు సభ్యులి రాజీనామా

మునుగోడు ఆగస్టు26(జనం సాక్షి): మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు శుక్రవారం రోజు గ్రామపంచాయతీ ఆవరణంలో రాజీనామా పత్రాలతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడంతో వార్డు ప్రజలకు అవసరమైన కనీస అవసరాలను కూడా తీర్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.అందుకోసమే రాజీనామా చేస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో వార్డుసభ్యులు పందుల నరసింహ, పద్మ,ఎడవల్లి సత్యవతి,వి.సత్తెమ్మ,యడవెల్లి శంకర్ రెడ్డి,పాలకూరి అశోక్,తదితరులు ఉన్నారు.