ఎల్బీనగర్( జనంసాక్షి ) మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ 17 (రత్న నగర్) మరియు వార్డ్ 18 (హనుమాన్ నగర్)లకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు *ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి* గారిని ఇంఛార్జిగా నియమించారు. ఈ మేరకు శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మునుగోడులో జరగబోయే ఉపఎన్నికలో టీఆర్ఎస్ ( బిఆర్ఎస్ ) గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇట్టి కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సిరెడ్డి,దామోదర్ రెడ్డి,
మల్లేశం,కిరణ్,శశిధర్ రెడ్డి,అమర్,రాంరెడ్డి హస్తినాపురం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఆందోజు సత్యం చారి
నాయకులు ఓరుగంటి వెంకటేష్, ఎల్.బి.నగర్ నియోజకవర్గ కొత్తపేట డివిజన్ అధ్యక్షులు
,లింగాల రాహుల్ గౌడ్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area




