నాంపల్లి అక్టోబర్ 8(జనం సాక్షి )నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న భౌతిక శాస్త్రం అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంధం మోహన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 10 నుండి 12వ తేదీలోపు దరఖాస్తులను వ్యక్తిగతంగా కళాశాలలో సమర్పించాలన్నారు. దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థికి చరవాణి ద్వారా సమాచారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థి తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం




