మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తెరాస తోనే సాధ్యం: -టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నల్గొండ బ్యూరో, జనం సాక్షి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా..మునుగోడు మండలం గూడపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం ఉప ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు.ఈ ఎన్నికల ప్రచారంలో తెరాస పార్టీ నాయకులతో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు,అభిమానులు పాల్గొన్నారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా మునుగోడు టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ  కారు నిండా నిధులు తీసుకొచ్చి మునుగోడు ను అభివృద్ధి చేస్తా
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తెరాస పార్టీ తోనే సాధ్యమన్నారు.ఈ ఉప ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంత  ప్రజల ఋణం తీర్చుకుంటా  మన మునుగోడు ప్రాంతాన్ని, ఆగిపోయిన పనులను పూర్తి చేసి అభివృద్ధి చేసుకుందామన్నారు.
ఈ మునుగోడు నుంచే మత రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపిని ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,  వర్కింగ్ ప్రెసిడెంట్  మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మునుగోడులో టి.ఆర్.ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు అక్కలు, చెల్లెలు, అన్నలు తమ్ముళ్లు అందరికి చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్న ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, దయచేసి మరోసారి అవకాశం ఇచ్చి, ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి,మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.