మునుగోడు నుంచే బిజెపి పతనం ప్రారంభం

ఉప ఎన్నికలపై కమ్యూనిస్టులు సమీక్ష
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
: మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పతనం ప్రారంభమైందని నియోజకవర్గ ప్రజలు బిజెపికి తగిన రీతిలో బుద్ధి చెప్తారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ కార్యాలయం లో మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరి రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిందని గతంలో 5 పర్యాయాలు సీపీఐ గెలుచుకుంది అన్నారు. రాజకీయ పరిణామాలు ఎన్నికల పొత్తులో భాగంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి సీపీఐ మద్దతు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి చేయకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరబోతున్నాడని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే సీపీఐ మునుగోడు నియోజకవర్గం నుండి పోటీచేయాలని చేసిన సవాలును ఖండిచారు. దేశంలో మోడీ పరిపాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై పెనుబారం మోపిన బిజెపి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కమ్యూనిస్టులకు ప్రధాన శత్రువు బీజేపీ పని ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నియోజకవర్గం లో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉందని , గెలుపు ఓటములను ప్రభావం చూపుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక లో సిపిఐ అభ్యర్థిని నిలబెట్టడంపై సమీక్షిస్తున్నామన్నారు . త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.మునుగోడు నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలంటే డిమాండ్ చేశారు ఉప ఎన్నికల్లో అధికారం పార్టీని పెండింగ్ ప్రాజెక్టులు నిర్లక్ష్యం పట్ల నిలదీస్తామన్నారు. భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు మాదిరిగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి లోడంగి శ్రవణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు మందడి నరసింహారెడ్డి బంటు వెంకటేశ్వర్లు బుల్గురి నరసింహ గిరి రమ టి వెంకటేశ్వర్లు తదితులున్నారు

తాజావార్తలు