మునుగోడు ప్రచారంలో పాల్గొన్న అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

– పాల్వాయి స్రవంతి గెలుపు కోసం ప్రచారం
అశ్వరావుపేట ఆర్ సి , అక్టోబర్ 21( జనం సాక్షి )

మునుగోడు ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం. నువ్వా నేనా అన్నట్టుగా మారింది. ముఖ్యంగా అశ్వరావుపేట నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. విజయ దరహాసంతో తిరిగి నియోజకవర్గంలో కాలు పెట్టాలనే ఆలోచన తో ఎవరికి వారు ప్రచారం లో స్పీడ్ పెంచారు. , చిన్నా, పెద్ద తేడా లేకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ అలింగనం చేసుకుంటున్నారు హోటల్ మొదలు, మాసం దుకాణాల వరకు ఏదీ విడవకుండా ప్రతి షాపు, ప్రతి ఇల్లు తడుతూ మరీ గుర్తు చూపించి ఓటు అడుగుతున్నారు పాల్వాయి స్రవంతి గెలుపు కోసం. ఈ విధంగా గెలుపుకు దగ్గరలో ఉన్న మూడు ప్రధాన పార్టీల నాయకులు మునుగోడులో అశ్వారావుపేట సత్తా చాటే పనిలో పడ్డారు. అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నడికుడి గ్రామాల్లో శుక్రవారం. విస్తృత ప్రచారం నిర్వహించారు. అశ్వారావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు
దంజూ నాయక్. పేటేటి నరసింహారావు . ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బూసి పాండు రంగా. బానోత్ భీముడు .సాబీర్ హుస్సేన్ బండారు మహేష్ . అన్నపురెడ్డిపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ ముద్రగడ వెంకటేశ్వరరావు మరియు దమ్మపేట ములకలపల్లి చండ్రుగొండ అన్నపరెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగళగిరి కృష్ణ
తదితరులు చావో రేవో అన్నట్లుగా వాళ్లకు కేటాయించిన ఏరియాల్లో విస్తృతంగా తిరిగారు. పీసీసీ అధికార ప్రతినిధి, అక్కడే మకాం వేసి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం అనుచరులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా నువ్వా నేనా అన్నట్లు గా సాగుతున్న మూడు ప్రధాన పార్టీ నేతల ప్రచారంను నియోజకవర్గంలోని వాళ్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.