మునుగోడు ప్రజాదీవెన సభకు
భారీగా బయలుదేరిన టీఆర్ఎస్ శ్రేణులు
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా దీవెన బహిరంగ సభకు శనివారం ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఆధ్వర్యంలో హత్నూర మండల టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సభకు హాజరై ప్రసంగించనున్న నేపథ్యంలో నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వెళ్ళిన వారిలో ఎంపీపీ వావిలాల నర్సింలు,పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బైసాని వెంకటేశం గుప్తా,రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, పార్టీ యువజన మండల అధ్యక్షుడు కిషోర్,ఎంపీటీసీ విటల్ రెడ్డి,సర్పంచి వీరస్వామి గౌడ్,నాయకులు వీరేశం గౌడ్,రాంచంద్రారెడ్డి, కొన్యాల సతీష్,కృష్ణ,అర్జున్,రాము,సాయి, నర్సింలు తదితరులు ఉన్నారు.