మునుగోడు సభకు బయలుదేరిన మండల బిజెపి నాయకులు
జన్నారం జనం సాక్షి న్యూస్:
మునుగోడు లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండల బిజెపి నాయకులు ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని వారు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరిస్తున్న అని వారు విమర్శించారు. ప్రజా సమస్యలపై బిజెపి ఆధ్వర్యంలో పోరాటం చేస్తుందని ప్రజల దీంతో రాబోయే ప్రభుత్వం మాదేనని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు గోలి చందు, పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం,సురేష్, కనకయ్య గౌడ్, భద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.