మున్నూరు కాపు ఐక్యతకై ఆత్మీయ సమ్మేళనం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 4న మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు మహాసభ జిల్లా అధ్యక్షులు ఏలిమినేటి రమేష్ తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ పోస్టర్ ను మున్నూరు కాపు సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులంతా రానున్న రోజుల్లో ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.మున్నూరుకాపు లను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు  మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నమన్నారు.అన్ని అంశాల్లో మున్నూరు కాపులు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ నెల 4న సుమంగళి ఫంక్షన్ హాల్లో  నిర్వహించే మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో కాపు సోదరులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ  సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు వదిరాజు రవి చంద్ర, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తో పాటు తెలంగాణ మహా సభ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తెలంగాణ మున్నూరుకాపు మహాసభ కార్యదర్శి లక్ష్మణ్  హాజరు కానున్నారని తెలిపారు.ఈ కార్యాక్రమంలో  స్వాతంత్ర సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.