మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
వరంగల్ ఈస్ట్, జూలై 22 (జనం సాక్షి)
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం కుల బాంధవులు శనివారం శాంతినగర్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని మున్నూరు కాపు సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొత్త దశరథం పటేల్, పుప్పాల రజనీకాంత్ పటేల్ పాల్గొన్నారు.మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా మందా శ్రీనివాసు పటేల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మందా శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకునందుకు కుల సంఘం బాంధవులకు కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. కాపు సంఘం అభ్యున్నతికి బాధ్యతగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి తోడ్పడుతానన్నాడు. జిల్లా కమిటీ సభ్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పుల సురేందర్ పటేల్, గాజుల సుమన్ పటేల్, పుప్పాల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శులు కొప్పుల క్రాంతి పటేల్,తోట సురేష్ పటేల్,ఆకుతోట రాజు పటేల్, సంయుక్త కార్యదర్శులు సత్తు శివ ప్రసాద్ పటేల్, రామంచి మధు పటేల్, పొన్నం వెంకటేశ్వర్లు పటేల్,సిరంగి రమేష్ కుమార్ పటేల్, కోశాధికారి నల్ల పూరి దయాసాగర్ పటేల్, కార్యవర్గ సభ్యులు ఆకుతోట శివపటేల్,ఆడుప కిరణ్ పటేల్, మడ్ల పెళ్లి నరేష్ పటేల్, బౌరిశెట్టి బద్రినాథ్ పటేల్, దేశమే అశోక్ పటేల్, బజ్జూరు వీరేశం పటేల్, భక్కి రంజిత్ పటేల్, కార్తీక్ పటేల్, నాయని క్రాంతి పటేల్,మేడిపల్లి రాజు, గ్రేటర్ వరంగల్ 33 వ డివిజన్ అధ్యక్షులు గా మందా సతీష్ కుమార్ పటేల్ ఎన్నుకున్నారు