మున్నూరు కాపు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఘన సన్మానం
కుబీర్ ( జనం సాక్షి 21); నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన కొట్టే హన్మండ్లు మున్నూరు కాపు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. కావున ఈ సందర్భంగా బుధవారం రోజున సిర్పిల్లీ (హెచ్) గ్రామ యువకులు, బహుజన సంఘ నాయకుల తో కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంట ఆనంద్, గంట గణేష్, భోజన్న, మారుతి పటేల్, గజ్జరాం, బోజరాం తదితరులు పాల్గొన్నారు.