మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ఐదు వేల రూపాయల పింఛన్ అమలు చేయాలని మంత్రికి వినతి.

పోటో: వినతి పత్రాన్ని అందజేస్తున్న మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్.
బెల్లంపల్లి, సెప్టెంబర్10,(జనంసాక్షి)
మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ₹ అయిదు వేల పింఛన్ మంజూరుకై ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని శనివారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ రాము నాయక్ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా కొన్ని డిమాండ్లను వినతి పత్రంలో వివరించారు.
1) అన్ని మున్సిపాలిటీలలో ప్రతి వార్డు లో అత్యవసర పనుల కోసం, పట్టణ ప్రగతి నిధుల నుండి, ప్రతి కౌన్సిలర్ లకు సంవత్సరానికి ఐదు లక్షల నిధులు కేటాయించాలి.
2)ప్రతి కౌన్సిలర్ కు గౌరవ వేతనం ₹ 15000 ఇవ్వాలి.
3)గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలకు, శాశ్వతంగా పింఛన్ ఇచ్చినట్లు
అదే మాదిరిగా గౌరవ కౌన్సిలర్ లకు ₹ 5000 పింఛను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
4) స్థానిక సంస్థల మీద కలెక్టర్ అధికారాలు తొలగించాలి. కౌన్సిల్ కు పూర్తి అధికారం ఇవ్వాలి.
5)మహిళా కౌన్సిలర్ లకు, వార్డు పర్యవేక్షించడానికి, ప్రభుత్వం ద్వారా, స్కూటీ, స్కూటర్ వెహికల్ ఇవ్వాలి.
6) అన్ని మున్సిపాలిటీలో ఐదు లక్షల నామినేషన్ పనులు మంజూరు చేయాలి.
7) కొత్త మున్సిపాలిటీలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి.
8) ప్రతి కార్పొరేటర్లకు, కౌన్సిలర్ కు హెల్త్ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించాలి.
9) మున్సిపల్, కార్పొరేషన్, ప్రజా ప్రతినిధుల కోసం, హైదరాబాదులో మున్సిపాల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాలి.
10) మున్సిపల్ కొత్త చట్టం పై, అవగాహన కొరకు, కౌన్సిలర్ లకు శిక్షణ తరగతులుఇవ్వాలి.
11) ప్రతి కౌన్సిల్ మీటింగ్ కు, అన్ని రకాల, శాఖల అధికారులు, హాజరయ్యే విధంగా, ఆదేశాలుజారీ చేయాలి.
12) ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ కు, వార్డు సమస్యలను పరిశీలించుటకు ల్యాప్టాప్, ప్రభుత్వ సిమ్ కార్డులు అందించాలి.
13) ప్రతి వార్డుకు, వార్డ్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి.
14) అభివృద్ధి చెందిన మోడల్ మున్సిపాలిటీలను, సందర్శన, కొరకు, కార్పొరేటర్లు కౌన్సిలర్లను తీసుకెళ్లాలి.
15) ప్రతి మున్సిపల్ ఆఫీసులో, కౌన్సిల్ చాంబర్ ఏర్పాటు చేయాలి
16) మున్సిపల్ లో ఉన్న, అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
17) చిన్నచిన్న మున్సిపాలిటీలకు, పట్టణ ప్రతినిధులతో పాటు స్పెషల్ గ్రాండ్ నిధులు మంజూరు చేసి,
వెనుకబడిన వార్డులకు అభివృద్ధి పరచాలి. అనే పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించి, ఇట్టి డిమాండ్లపై శాసనసభ సమావేశం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టి జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.