*మున్సిపల్ కార్యాలయంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే*
కోదాడ అక్టోబర్ 15(జనం సాక్షి) భద్రత కోసం ఏకమవ్వండి చేతులు శుభ్రం చేసుకోండి అనీ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, లు అన్నారు. ఈరోజు కోదాడ పురపాలక సంఘ కార్యాలయంలోని తమ సిబ్బందితో కలిసి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ను ఘనంగా జరిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ ద్వారా శుభ్రం చేసుకోవాలి, మన ఆరోగ్య భద్రతను మనమే కాపాడుకోవాలి అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి. ఎన్విరాన్మెంటల్ ఇన్చార్జి భవాని, ఆర్సీలు మేనేజర్లు, మున్సిపల్ ఏఈలు మేనేజర్లు బిల్ కలెక్టర్లు, మరియు మున్సిపాలిటీ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area