Friday, 6 November 2026

మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 17
హింస దౌర్జన్యం హత్యలు హత్యాచారాలతో తెలంగాణ ప్రజలనువంచించి తెలంగాణ భూభాగాన్ని 74 ఏళ్ల క్రితం దురాక్రమణ చేసిన రోజు ఇదే 17 సెప్టెంబర్ 1948 అని మల్కాజిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.రాష్ట్రముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు జాతీయసమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగాఎమ్మెల్యేమాట్లాడుతూనేడుదేశంలోదేశంలో1948సెప్టెంబర్17నజరిగినదుర్ఘటనపైవివిధరకాలచర్చలుజరుగుతున్ననేపథ్యంలోతెలంగాణకు జరిగింది. ముమ్మాటికి విద్రోహమేనని తెలంగాణ ప్రజలకు చీకటి రోజు గాని మిగిలిపోయిందని వారు అన్నారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అల్వాల్ పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐ గంగాధర్, ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి, వివిధ డివిజన్లో కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేందర్ నాథ్, సబిత అనిల్ కిషోర్, మున్సిపల్ అధికారులు ఎసిపి విజయశ్రీ, సూపరిండెంట్ హరిబాబు టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు అనిల్ కిషోర్, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు, రాపర్తి చంద్రశేఖర్, శివ, శ్రీశైలం యాదవ్, ఇసాక్ ఖాన్, రఘునాథ్, మోసిన్, చంద్రశేఖర్, జ్యోతి యాదవ్, కవిత, బబిత, సులోచన, సరిత, గాయత్రి, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.