మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు
జనం సాక్షి ప్రతినిధి మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ బీసి నిరుద్యోగులకు రిజర్వేషన్ పరంగ రావాల్సిన మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలు తక్షణమే టెండర్ల నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి మున్సిపల్ దుకాణాలకు గత సంవత్సరం వేకెన్ట్ నోటీసులు జారీ చేసినప్పటికీ.. నిబంధనలు….అమలు పరిచి ఖాళీ చేయించి తిరిగి రెండవసారి నోటిఫికేషన్లు జారీ చేయాలని హెచ్చరిస్తు బినామీ వ్యాపారస్థులకు కొమ్ముకాస్తున్న మున్సిపల్ అధికారులు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ 13 నెంబర్ షాప్ గల వ్యక్తి కి కాలపరిమితి అయిపోయినా కూడా అదనంగా సంవత్సరం పైగా అడ్డగోలుగా అక్రమంగా కొనసాగుతున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని మరియు యా చం బచ్చయ్య కుటుంబానికి 14 షాపులు 45 సంవత్సరాలుగా అక్రమంగా మున్సిపల్ నిబంధనలు పక్కదారి పట్టిస్తూ అను భవిస్తూన్నటువంటి యజమానిపై మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి మరియు దుకాణాలు నోటిఫికేషన్లు ప్రకటించకపోవడంపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సంబంధించిన అధికారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ చిత్తశుద్ధి ఉంటే దుకాణాలపై జోక్యం చేసుకోవాలి లేదా. రహస్యం అవినీతి ఒప్పందాలు భైర్గతం వ్యవహారాలు ప్రజల పక్షాన బహిర్గతం చేయాలని రాజీనామా ప్రకటించాలి వ్యాపారస్తులకు కొమ్ముకాస్తున్న అటువంటి చైర్మన్ అసమర్ధత మున్సిపల్ పరిపాలన పచ్చి పడిపోయింది. మెదక్ లో కావున ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనందున మున్సిపల్ దుకాణాలు కేటాయించేందుకు తగిన చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా నష్టపోతున్నారని దీక్షా శిబిరంలో ఆవేదన వ్యక్తం చేశారు కావున తక్షణమే దుకాణాల టెండర్లను వేలం పాట దుకాణాల టెండర్ల వేలం పాట నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రకటించేఎంతవరకు ఉద్యమిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం ఇట్టి కార్యక్రమం లో.. SC. ST. BC. నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఎమ్మార్పీఎస్ msp. ఎం ఎస్ ఎఫ్ నాయకులు బాల్రాజ్…. Ch.. సిద్దు..మెదక్ పట్టణ కన్వీనర్ కుమార్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్.-కన్వీనర్….. బి లక్ష్మణ్ MSF… కిరణ్ కుమార్ అనిల్.. మాలమహానాడు. పట్టణv అధ్యక్షుడునాయకులు.. బత్తుల ప్రసాద్ వినోద్ పోశెట్టి సైదులు సుందర్ గోపాల్ నాయక్ ప్రకాష్ నాయక్.. ప్రభుదాస్ లక్ష్మణ్ అశోక్ . సంజీవులు రాబర్ట్.. సంపత్ కుమార్ రవి .