మున్సిపాలిటీ పేరు మార్పు పట్ల హర్షం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : బి-జోన్ సెంటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో క్యాథనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపుర్ మున్సిపాలిటీ గా పేరు మార్చడానికి కృషి చేసి, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ను ఒప్పించి, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి, మంత్రివర్యులు కే.టీ.ఆర్. తో తీర్మానం చేయించిన చెన్నూర్ ఎం.ఎల్.ఏ. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు వర్థకసంఘం అధ్యక్షులు అడెపు కృష్ణ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్థక సంఘం జనరల్ సెక్రెటరీ బత్తుల శ్రీనివాస్, కోశాధికారి అడెపు తిరుపతి, జాయింట్ సెక్రటరీ కొండ కుమార్, వ ర్థకసంఘం సభ్యులు , తెరాస పార్టీ యువ నాయకులు కొక్కుల సతిష్, మూర్తి వర్థకసంఘం సభ్యులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.