Tuesday, 3 November 2026

ములాయం సింగ్ మరణం బాధకారం–కృష్ణా యాదవ్

నాచారం(జనంసాక్షి) : సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం బాధాకరం అని తెలంగాణ  యాదవ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్  అసోసియేషన్ (టివైఓపిఏ) రాష్ట్ర అధ్యక్షుడు  మన్య బోయిన  కృష్ణ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, యూపీ సీఎంగా 3 సార్లు ములాయం సింగ్ యాదవ్ సేవలను కొనియాడారు. అలాగే ములాయంసింగ్ యాదవ్ కుటుంబానికి  ప్రగాఢ సానుభూతిని తెలిపారు . ఈ కార్యక్రమంలో జి రాజశేఖర్ యాదవ్,  దేవేందర్ యాదవ్,  రవికుమార్,  జి. రాజు యాదవ్,  నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.