Tuesday, 3 November 2026

వంటగ్యాస్ ధరలను తగ్గించాలి.

బిజినేపల్లి, జనం సాక్షి .ఆక్టోబరు 10: పేదలకు భారమవుతున్న వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బంగారి పర్వతాలు సోమవారం డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేద ప్రజల జీవనం దిన దిన గండంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రూ.4 వందలు, రూ.5 వందలు ఉన్న సిలిండర్ ధరను రూ.12 వందల వరకు పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేవలం ఎడాదికి 3 సిలిండర్లు మాత్రమే ఇవ్వగా, అదనంగా అవసరమైతే మరో రూ. వంద ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని నిబంధన పెట్టడంతో ప్రజలు గ్యాస్ వినియోగానికి జంకుతున్నారన్నారు. ఇప్పటికైనా వంట గ్యాస్ ధరలను తగ్గించి పేద ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను నియంత్రించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.