Tuesday, 3 November 2026

మూడు రాష్ట్రాల డిమాండుతోనే తెలంగాణ సాధ్యం : బైరెడ్డి

హైదనాబాద్‌: ఎప్పటికైనా మూడు రాష్ట్రాల డిమాండు వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమవుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. తెరాస, భాజపాలు రెండూ ఒక్క తెలంగాణ కోసమే పోరాడితే వందేళ్లయినా రాష్ట్రం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదని చెప్పారు.  వెనుకబడిన రాయలసీమకు సైతం ప్రత్యేక రాష్ట్రం కావాలన్న నినాదంతో ఇద్దరం కలసి పోరాటం చేద్దాం రమ్మని తెరాస, భాజపాలకు ఆయన పిలుపు నిచ్చారు. రెండు ప్రాంతాల నాయకులు కలిసి పోరాడితే కేంద్రం కాళ్ల బేరానికి రాక  తప్పదని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న ఉండవల్లి వాదనకు కాలం చెల్లిందన్నారు. రాయలసీమ నాయకులు ప్రాంతానికో మాట మాట్లాడుతూ పబ్బంగడుపుకుంటున్నారని బైరెడ్డి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *