*మృతదేహానికి నివాళులు అర్పించిన తెరాస నాయకులు..*
*దేవరుప్పుల, సెప్టెంబర్ 22 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం,పెడ్డమాడుర్ గ్రామంలో గనుపాక స్వామి ఆకస్మిక మరణం కుటుంబానికి పార్టీకి తీరని లోటని తెరాస మండల నాయకులు …. గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త గనుపాక స్వామి (38) బుధవారం అకస్మాత్తుగా మరణించిగా విషయం తెలుసుకున్న పల్లా సుందర్ రాంరెడ్డి,బస్వ మల్లేష్, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్,అకవరం పెద్దా రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ అకవరం రవీందర్ రెడ్డిలు గురువారం స్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదారిచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి తీగల సత్తయ్య ఎంపిటిసి పానుగంటి గిరి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి రాములు ఉప సర్పంచ్ మానుపాటి వెంకటేష్,సంజీవ రెడ్డి,వార్డ్ నెంబర్ మునుగొండ రాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.