మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన దేవి రవీందర్

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 01:సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామానికి చెందిన తుడుం లింగం (28)గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకొని శనివారం రోజు వారి కుటుంబాన్ని ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ పరామర్శించి వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలోదేవి రవీందర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కిష్టారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.