Thursday, 5 November 2026

మృతుని కుటుంబం పరామర్శ

గద్వాల, ధరూరు మండలం ర్యాలంపాడుకు చెందిన మాజి సర్పంచు గుడిశె తిమ్మప్ప చికిత్స పోందుతు మరణించగా ఆయన కుటుంబాన్ని శనివారం గద్వాల మార్కెట్‌యార్డు చైర్మెన్‌ బండ్ల లక్ష్మిదేవమ్మ పరామర్శించారు. గత కోన్నిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న తిమ్మప్ప మరణించిన వార్త తెలియగానే ఆమె వారికుటుంబాన్ని పరామర్శించి ప్రగాడ సంతాపంవ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పరామర్శించినవారిలో వెంకటేశ్వరరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.