Thursday, 5 November 2026

మృతుని కుటుంబానికి ఆర్ధికం సాయం — కల్లూరి

తుర్కపల్లి  మే 24 (జనంసాక్షి)
యాదాద్రి భువనగిరి జిల్లా
తుర్కపల్లి మండలం, తిర్మలపురం గ్రామానికి చెందిన  శ్రీపాద బిక్షపతి అనే వ్యక్తి చాలా రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడం జరిగింది అతనికి భార్య,ఒక కూతురు ఒక కుమారుడు  ఉన్నారు ఆ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోవడంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఇతనిది అత్యంత నిరుపేద కుటుంబం కావున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు విషయాన్ని తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ కల్లూరి రాంచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు తెలియజేసిన వెంటనే సానుకూలంగా స్పందించి ఆర్థిక   సహాయం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, సత్యనారాయణ, వంగ పాండురంగారెడ్డి ,రాములు ,చంద్రమౌళి, నర్సింలు, టీపీఎస్ సభ్యులు, మాదిగే  వెంకటస్వామి,గడ్డమీది యాదగిరి,ఆకుల రాజ్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.