మృతుని కుటుంబానికి భరోసా

డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి

మండల పరిధి బూరుగుపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రెడ్డబోయిన శేషయ్య ప్రమాదవశాత్తు ఆదివారం మరణించారు.విషయం తెలుసుకున్న నియోజకవర్గ నేత జటోత్ రామచంద్ర నాయక్ స్థానిక మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ను ఆదేశించారు.దీంతో సోమవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తక్షణ
ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఆయన వెంట సీనియర్ నాయకులు
నందిగామ రామ్ రెడ్డి,పగిడిపాల వెంకటేశ్వర్లు, నల్లబెల్లి గోపయ్య,బానోత్ రాము,రామ్ కోటేష్ యాదవ్,గుగులోత్ హుస్సేన్,నిరుడు నరేష్,చిలుక వెంకన్న,గడ్డం సంపత్,వెంకట్,గంగరాజు తదితరులు ఉన్నారు.