ఘనంగా బాలికల దినోత్సవం

డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి

అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని
స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్లమ్మ ఆధ్వర్యంలో దినోత్సవం జరుపుకున్నారు.బాలికల రక్షణకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. సిడిపిఓ ఎల్లమ్మ మాట్లాడుతూ..బాల్యవివాహాలు, బాలిక అక్రమ రవాణాను ప్రభుత్వం నిషేధించిందన్నారు.విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.అనంతరం 35 మంది విద్యార్థినీలకు డ్రాయింగ్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ మండల కోఆర్డినేటర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.