మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు అందించిన…. టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జనగామ జిల్లా . బచ్చన్నపేట మండలం. బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త . ఎద్దు వెంకటేష్ ఈ మధ్యకాలంలో కరెంటు షాక్ తో మరణించగా అతని భార్య ఎద్దు కళ్యాణి కుమారుడు ఎద్దు పవన్ కు రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ ఠాగూర్. మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా గాంధీభవన్లో అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ స్పోక్ పర్సన్ ధర్మ సంతోష్ రెడ్డి. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ. కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్. జిల్లా నాయకులు ఉడత రవి. బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచా వెంకటరెడ్డి. పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మాచారి. మండల ఉపాధ్యక్షులు గార్లపాటి మహిపాల్ రెడ్డి. బూత్ మెంబర్లు గార్లపాటి కరుణాకర్ రెడ్డి. పంజాల కరుణాకర్ గౌడ్. ఎద్దు అశోకు ఉన్నారు