హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 16(జనంసాక్షి) హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొడముంజ విజయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మృతుడి కుటుంబాన్ని ఆదివారం సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు..అనంతరం వారి కుటుంబ సభ్యులకి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు.




