మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 18, (జనం సాక్షి ) :  మండలం లోని నమిలిగొండ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండలనాయకులు మోటం ప్రభాకర్  తండ్రి మోటం ఉపేందర్ మరణించినందున ఉపేందర్  పార్థివదేహాన్ని తెలంగాణ తొలిఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య  సందర్శించి  ఉపేందర్ పార్థివదేహానికి పూలమాల వేసినివాళు లు అర్పించి,అంతిమయాత్రలో పాల్గొని స్వయం గా పాడే మోసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. అదేవిధంగా మండలంలోని మీదికొండ గ్రామంలో జోగు కొమురయ్యమృతిచెందగా,ఎమ్మె ల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గ్రామానికి చేరుకొ ని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు ,కుటుంబ సభ్యులు , బంధువులు , గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.