మృతుల కుటుంబాలకు పరామర్శ
కాంగ్రెస్ డెలిగేట్ కమిటీ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావ్
ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 29 ,(జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో రెండు రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మరణించిన కనక వికాస్ ,బైండ్ల వినీత్ ఇరు కుటుంబ సభ్యులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డేలిగేట్ కల్వకుంట్ల సుజిత్ పరమర్శించి , వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని , తనవంతు సహయ సహకారాలు కూడ అందిస్తామని తెలిపి ,వారి కుటుంబాలతో తనకున్న అనుబంధాలను గుర్తు చేశారు. ఆయన వెంట పిషేర్మేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ , మత్మ్యపారిశ్రామిక జిల్లా డైరెక్టర్ కల్లేడ గంగాధర్ , మమిడి రాజశేఖర్ రెడ్డి , మొగిలి రాజేందర్ , డబ్బా కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట ఆనందం , చుక్క బొట్ల నరేందర్ , జనశంకర్ ,రాడేశ్రీనివాస్ , కరిపే కాశన్న , తేలు చిన్న నరసయ్య , తోకల ప్రశాంత్ ,కనక గంగాధర్ కనకా మురళి, బైండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.