స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 15,( జనంసాక్షి ) : మండలంలోని తాటికొండలో మారపాక కృష్ణా మృతి చెందిన విషయం తెలుసుకొని ఎస్ఎస్ కె సొసైటీ చైర్మన్ బొల్లపల్లి కృష్ణ గ్రామానికి చేరుకొని మృతుని కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహా యంగా3వేల రూపాయలు ఆర్థిక సహాయం అంద జేశారు.అదేవిధంగామండలంలోని కొత్తపెళ్లిగ్రామా నికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెరుగురాజయ్య తల్లి సోమనర్సమ్మ (80)మృతి చెందిన విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరా మర్శించి 2 వేల ఐదు వందలు ఆర్ధిక సహాయం కృష్ణ అందజేశారు. కొత్తపల్లి గ్రామంలో అలీబెగ్ మృతి చెందిన విషయంతెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో బొల్లపల్లి కృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకుల మారాపక శ్రీనివాస్, గుండె యాదగిరి , మరాపకా వసంత్,మండల ఓబీసీసెల్ అధ్యక్షుడు చల్లా తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాకార్య దర్శి కొరుకొప్పుల మధు గౌడ్, నాయకులు నున వతు సుమన్ నాయక్, భూక్యా చంద్రు నాయక్ , రవి , రహీం బేగ్ ,తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎస్ ఎస్ కే సొసైటీ చైర్మన్ బొల్లపల్లి కృష్ణ




