Thursday, 5 November 2026

అద్దె బస్సులు నడపడానికి దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి )అద్దె బస్సులు నడపడానికి దరఖాస్తుల చేసుకోవాలని జహీరాబాద్ డిపో మేనేజర్ రజిని కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  టి.యస్.ఆర్.టి.సి మెదక్ రీజియన్ లోని 6 డిపోలలో 18. రుట్ల యందు 48 అద్దె బస్సులను’ అద్దె ప్రాతిపదికన నడపడం కొరకు తేది 21.09.2022 బుధవారం నాడు, త్రినేత్ర కాంప్లెక్స్, టి.యస్.ఆర్.టి.సి రీజినల్ మేనేజర్ కార్యాలయము ఉదయము 10.30 గం.ల నుండి మధ్యాహ్నం 2.00 గం. ల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి అని తెలిపారు. అదే రోజు టెండర్ బాక్స్ ను మధ్యాహ్నం 3.00 గం. లకు తెరువబడును. రూటు, కిలోమీటర్, బస్ ప్రమాణాలను సంబంధిత టెండర్ నోటిఫికేషన్ లో పొందుపరచబడినవి . దరఖాస్తుఫారం టెండర్ వేసే సమయం లో రూ.2,950/- 18% జి.ఎస్.టి. తో కలిపి  ను రిజిస్ట్రేషన్ కొరకు చెల్లించవలెను. ఇట్టి డబ్బులు వాపసు ఇవ్వబడవు. రూ.50,000/- కాషన్ డిపాసిట్ కొరకు చెల్లించవలెను అన్నారు. ఒకవేళ రూట్ కేటాయించబడినచో ఈ రూ.60,000/- తిరిగి ఇవ్వబడును అన్నారు. ఈ రెండు మొత్తాలను విడివిడిగా డిమాండ్ డ్రాప్ట్ ల రూపంలో అకౌంట్స్ ఆఫీసర్ టీ యస్ ఆర్ టి సి మెదక్ రీజియన్ సంగారెడ్డి పేరిట చెల్లించవలెను అన్నారు. ఆర్. టి.సి. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు 18 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. ఎటువంటి కారణం లేకుండ ఈ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసే హక్కు సంస్థకు కలదు. ఈ అవకాశము ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.